(Published in Andhra Bhoomi, 24 Nov 2011)
మున్సిపల్ కమీషనర్ అయిన నా క్లాస్స్మేట్ మధుని కలవడానికి వాళ్ళ ఆఫీసుకు వెళ్లాను.ఇద్దరం తరచూ కలుస్తుంటాము. మాట్లాడుకుంటూ ఉండగానే
మున్సిపల్ కమీషనర్ అయిన నా క్లాస్స్మేట్ మధుని కలవడానికి వాళ్ళ ఆఫీసుకు వెళ్లాను.ఇద్దరం తరచూ కలుస్తుంటాము. మాట్లాడుకుంటూ ఉండగానే
“మీకోసం ఎవరో అమ్మాయి వచ్చారు సర్, రెండుమూడు సార్లు వచ్చినా బిజీగా వున్నారంటే వెళ్ళిపోయారు, పంపనా ?”అన్నాడు సెక్రెటరి. నా పక్క చూసాడు మధు, మా సమయాన్ని కేటాయించడానికి. ”సరేకానీ” అన్నా. నేను అక్కడే వున్నహిందూ పేపర్ తీసుకున్నా. మధు, వచ్చిన అమ్మాయి ల సంభాషణ ఇంటరెస్టింగ్ వుండడం తో హిందూ పేపర్ ప్రక్కన పెట్టా. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం గురించి ఆ అమ్మాయి వివరిస్తోంది. తక్కువ ధరలో డస్ట్ బిన్స్ ని ఎలా తయారు చేయొచ్చో... చెబుతూ వాటికి ఫండ్స్ కూడా తను కల్లెక్ట్ చేస్తానని చెప్పడంతో మరింత ఆసక్తిగా చూశా. ఆ అమ్మాయి రూపం, వ్యక్తిత్వం నన్నుచాలా ఆకర్షించించాయి. ఈ కాలం యువతలో యింత మంచి భావాలా! దేశం, సమాజం పైన యింత ఆసక్తా? ఓహ్.. . ప్రశాంతమైన ఆ వదనంలో స్పష్టమైన తన ఆశయాల పట్ల వున్న నమ్మకం నన్నుఅబ్బుర పరిచింది. “అలోచించి చెబుతాను.” అన్నాడు మధు. “థాంక్ యు సర్ ” అని ఆ అమ్మాయి వెళ్లి పోయింది.. “సారీ రా ’ అన్నాడు మధు.
”పర్లేదు కానీ ఆ అమ్మాయి పేరు ఏంటి, నేవినలా ?"అన్నాను.
"ఇదిగో కార్డ్ ఇచ్చింది చూడు."ఇచ్చాడు మధు.
వెన్నెల, పి.ఓ, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్ అని వుంది. ఎంత అందమైన పేరు ? తల్లిదండ్రులు మంచి భావుకులు కాబోలు. అనుకున్నా."ఏంటి డ్రా చేసి చూపించింది? "అడిగా.
"డస్ట్ బిన్ మోడల్స్....చూడు..." పేపర్ నాకిచ్చాడు.దాంట్లో నాలుగు మోడల్స్, వాటి తయారికి అయ్యే ఖర్చు కూడా రాసింది .
"ఆ అమ్మాయిని నేను మళ్ళి కలవాలి మధూ" అన్నా.
"నీ ఆశయాలకి, ఆలోచనలకి దగ్గరగా వుంది కదా...." మధుకు అర్థమైంది.
మూడు రోజుల తర్వాత మధు నన్ను రమ్మన్నాడు ."వెన్నెల వస్తోందా?"అన్నా.
మూడు రోజుల తర్వాత మధు నన్ను రమ్మన్నాడు ."వెన్నెల వస్తోందా?"అన్నా.
"అమావాస్య రోజున వెన్నెలా ...!". నవ్వాడు
"నిజంగా ఆ అమ్మాయిఅమావాస్యరోజున కూడా వెన్నెల కురిపించేలా వుంది కదా!"
"చెత్త చెదారం తో డీల్ చేసేవాడ్నిబాబూ ... నీలా రొమాంటిక్ పోయెట్రి టీచ్ చేసే వాడ్ని కాను , ఆ అమ్మాయి చెప్పిన మోడల్ డస్ట్ బిన్ ఓకే చేస్తున్నాము, నీకు పరిచయం చేస్తాను లంచ్ బ్రేక్ లో రాగలవా?"అన్నాడు.
"కాలేజ్ కు సెలవు పెట్టి అయినా వస్తాను." అన్నాను .నేను వెళ్ళిన కాసేపటికి వెన్నెల కూడా వచ్చింది.
"ఇతను ఆనంద్ నా బెస్ట్ ఫ్రెండ్,ఇంగ్లీష్ లెక్చరర్, మీలాగే సోషల్ సర్వీసు ఇష్టం .డొనేషన్స్ బాగా ఇస్తాడు మీ ఆర్గనయిజేషన్ కి, అడగండి." అన్నాడు.
"గ్లాడ్ టు మీట్యు సర్" అంది.
"రియల్లీ వేరి గ్లాడ్ టు సి యు .." నా మనసు హాయిగా అనిపించింది ఆ అమ్మాయిని పలకరించడం. ఆ తర్వాత వెన్నెలను స్టడీ చేయడం నాకిష్టమైన పని గా మారింది .
క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం కు మా స్టూడెంట్స్ ను కూడా తీసుకెళ్ళడం తో వెన్నెలతో స్నేహం పెరిగింది. కానీ ఆమె కుటుంబం గురించి మాత్రం ఎప్పుడూ ఆమె చెప్పలేదు , నేను అడగలేదు. దానికి ఇంకా టైం వుందని అనుకున్నా.అనుపమతో, ఆక్షయ్ తో కూడా వెన్నెల గురించి చెప్పేవాడ్ని వాళ్ళుకూడా ఆసక్తిగా వినే వాళ్ళు. మీ ఇల్లు ఎక్కడ అని ఏదో సందర్భం లో అడిగాను. అడ్రసు చెబుతూ వాళ్ళింటికి రమ్మన్నది. కానీ వెంటనే వెళ్ళలేదు ,సందేహించాను ఆ అమ్మాయిని ఎక్కువ అబ్సర్వ్ చేసినట్లు ఆమెకు తెలియ కూడదని.
లైఫ్ ఇస్ క్రేజి
లైఫ్ ఇస్ మ్యాడ్
డోంట్ బి అఫ్రైడ్
కార్లీ డోంట్ బి సాడ్
దట్స్ యువర్ డెస్టిని
ద ఓన్లీ ఛాన్స్
టెక్ ఇట్ , టెక్ ఇట్ ఇన్ యువర్ హాండ్స్పాట వింటూ, అద్భుతం అనుకున్నా, పాటే కాదు వెన్నెల తెలివి తేటలు కూడా. ఈ అమ్మాయికి తెలియని విషయాలే లేవు ఆశ్చర్యం తో పాటు నాకు ఆనందం కలిగింది. బాబు రిమోట్ తీసుకుంటూ ... "అమ్మా ప్లీస్" అన్నాడు .

వెన్నెలను కలవక చాలా రోజులైంది, చూడాలనిపించింది, మా పరిచయం పెరగాలి ..ఆ అమ్మాయితో జీవితాంతo అనుబంధం కావాలి. ఫోన్ చేశా వస్తున్నానని ."మోస్ట్ వెల్కం సర్" అంది."రండి సర్" అంది నన్ను గుమ్మంలో చూడగానే . ఐదేళ్ళ బాబు టీవీ లో టాం అండ్ జెర్రీ చూస్తున్నాడు. వెన్నెల ఏదో చదువుతూ ఏదో మ్యూజిక్ వింటోంది. వెంటనే టీవీ, మ్యూజిక్ కూడా ఆపేసింది. "ఇందాక వస్తున్న మ్యూజిక్ పెట్టరా వెన్నెలా ....ఆలాంటి...ట్యూన్తో తెలుగులో ఏదో పాట వుంది " అన్నాను . సి.డి. ప్లే చేస్తూ "అవును సర్ ఇది కార్లైల్ సాంగ్ గా పిలవబడే ఇంగ్లిష్ సినిమా పాట, సాండ్ర కేట్ అనే ఆమె పాడింది, నిజానికి ఇది నమ్జిలిన్ నోరోబంజాద్ అనే ఆమె పాడిన మంగోలియన్ జానపదగీతం, అండర్ ద సన్ ఆఫ్ ప్లాసిడ్ వాల్డ్ అనేపాటకు అనుకరణ. దీన్నే మనవాళ్ళు "తెలుసా మనసా" పాట కు ట్యూన్ తీసుకున్నారు."
కార్లీ డోంట్ బి సాడ్లైఫ్ ఇస్ క్రేజి
లైఫ్ ఇస్ మ్యాడ్
డోంట్ బి అఫ్రైడ్
కార్లీ డోంట్ బి సాడ్
దట్స్ యువర్ డెస్టిని
ద ఓన్లీ ఛాన్స్
టెక్ ఇట్ , టెక్ ఇట్ ఇన్ యువర్ హాండ్స్పాట వింటూ, అద్భుతం అనుకున్నా, పాటే కాదు వెన్నెల తెలివి తేటలు కూడా. ఈ అమ్మాయికి తెలియని విషయాలే లేవు ఆశ్చర్యం తో పాటు నాకు ఆనందం కలిగింది. బాబు రిమోట్ తీసుకుంటూ ... "అమ్మా ప్లీస్" అన్నాడు .
"మీ అబ్బాయా ?" ఆశర్యంగా అన్నాను, కాసేపు ఏమీ తోచలా ...వెన్నెల పెళ్లి కాని అమ్మాయి లాగే వుంది . ఆమె పై నా ఆశలు... ప్చ్...వెంటనే తమాయించుకున్నా.
"అవును సర్, సర్ కి నమస్తే చెప్పు ద్రువ్" అంది వాడు సిగ్గుగా నమస్తే చెప్పి , మళ్ళి టీవీ రిమోట్ తీసుకోబోయాడు, "నో , నువ్వు ఇప్పుడు డ్రాయింగ్ చేస్తావన్న మాట" ,అంటూ ఓ డ్రాయింగ్ బుక్, వాటర్ కలర్స్ ఇచ్చింది. బుద్ధిగా వాడు ఆ పనిలో మునిగి పోయాడు .
"చెప్పండి సర్ " అంది.
"ఎంత వరకు వచ్చింది డస్ట్ బిన్ ఫండ్ కలెక్షన్ , ముందుగా ఎక్కడ పెట్టాలని ? అడిగా.
"మొదటిగా జనరల్ హాస్పిటల్ అనుకున్నాము సర్, అక్కడే కదా పరిసరాలు శుభ్రంగా వుండాల్సింది , వంద ఆర్డర్ చేసాము, తరువాత ఫండ్స్ ను బట్టి మిగతా ప్రాంతాల్లో చేద్దామని...."ఆగింది.
"అవునవును అది నిజం, నా విరాళం ఇద్దామని, డబ్బు తీసి టీపాయ్ మీద పెట్టా,
"మీరుకూడా బాధ్యత తీసుకుంటే బావుంటుంది, డబ్బుకంటే మనుషుల అవసరమే ఎక్కువ వుంది, మాకు సొసైటి అలాగేం లేదు ..కొద్దిమంది స్నేహితులు కలిసి చేస్తున్నాము. మన వూరు శుభ్రంగా పచ్చగావుండాలని " అంది. అందం పై, సొంత ఆనందం పై ఆసక్తి ఉండాల్సిన వయస్సులో సామాజిక శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఆమెపై నాకు అపారమైన గౌరవం కలిగింది.
టీపాయ్ మీదా జోసెఫ్ బల్గకోవ్ నావల్ ది మాస్టర్ అండ్ మార్గరిట చూసి "ఇది మీరు చదువుతున్నారా "? అన్నా,
టీపాయ్ మీదా జోసెఫ్ బల్గకోవ్ నావల్ ది మాస్టర్ అండ్ మార్గరిట చూసి "ఇది మీరు చదువుతున్నారా "? అన్నా,
"ఊ " అంది"
"ఎమ్మెస్సీఫిజిక్స్ చేశామన్నారు మరి సాహిత్యం, అదీ మైఖేల్ బల్గకోవ్ అంత ఈజీ కాదు కూడాను....",చిన్నగా నవ్వింది. పక్కనే వున్న బుక్ షెల్ఫ్ చూశా, నబోకావ్, బోరిస్ పాస్తేర్నాక్,అన్నాఅఖ్మతోవా, పాబ్లోనెరుడా, టి.ఎస్.ఇలియట్, తిలక్, శ్రీ శ్రీ , చలం, గురజాడ, బుచ్చిబాబు, గోపీచంద్, ఇంకా లబ్ద ప్రతిష్టులైన ఎంతో మంది కవులు రచయితల పుస్తకాలు చూస్తే నాకు తల తిరిగింది, నేనింతకాలం సాహిత్యం యింత విస్తృతంగా చదివేవాళ్ళను కలవనే లేదు, సాహిత్యం గురించి నేను ఆక్షయ్ తో తప్ప ఇంకెవరితో మాట్లాడే అవకాశమే లేదు. వెన్నెల కిష్ట మైన రచనల గురించి అడిగినప్పుడు తను చదివిన పుస్తకాలు, తాను చూసిన సినిమాలు, థియేటర్ ప్లేసు, ఒపెరాసు, చూసిన ప్రపంచం, కోరుకునే సమాజం గురించి చెప్పింది. ఓహ్ అద్భుతమైన వ్యక్తి అనుకున్నా. ఆ అమ్మాయిని చూసే కొద్దీ ముచ్చటేసింది, అప్పుడు గుర్తొచ్చింది ఈ అమ్మాయి వరించిన భాగ్యశాలి ఎవరో మరి. "మీ వారేం చేస్తుంటారు?" అడిగా.
కాసేపు మౌనం వహించిన వెన్నెల మెల్లిగా " హీ ఇస్ నో మోర్" అంది.
ఒక్కసారి నా హృదయం భగ్గుమంది. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు. వెన్నెల మౌనంగా వుండిపోయింది. ఎలాగో గొంతు పెగల్చుకుని "అయాం సారీ వెన్నెలా, మిమ్మల్నిగాయ పెట్టాననుకుంటాను." అన్నా.
"అదేమీలేదు లెండి, ఎప్పుడూ ఎదుర్కునే చర్చనే, అలవాటుపడ్డాను" కళ్ళలో తడి మెరుస్తుండగా నవ్వింది."మా అత్తగారు మామగారు వాకింగ్ వెళ్ళారు, వస్తారు మీకు పరిచయం చేస్తాను, మా మామగారు కూడా బాగా చదువుతారు" అంది.
ఓహ్ భర్త మరణించినా అతని తల్లి దండ్రుల్ని చూసుకుంటున్నదంటే..హాట్స్ ఆఫ్ టు యు అనుకున్నా. చిన్న చిన్న కష్టాలకే కన్నీళ్ళ మయమయే వాళ్ళు ,ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళున్నలోకంలో ఈ అమ్మాయి తనకష్టాలన్నీ మరిచి కుటుంబం పట్ల మరియు సమాజం పట్ల ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తోంది! …దగ్గరగా వెళ్ళేకొద్దీ కొంత మంది గొప్పవాళ్ళు సామాన్యులుగా కనపడతారు. కొందరు సామాన్యులుగా కనిపించి చేరువయే కొద్దీ గొప్పగా కనిపిస్తారు. వెన్నెల మొదటినుండి నాకొక అద్భుతం ఇప్పుడు మరింత అద్భుతంగా కనిపిస్తోంది.
తర్వాత వెన్నెల అత్తమామలు, అమెరికాలో వెన్నెల అన్నయ్య దగ్గర నుండి వచ్చిన తల్లిదండ్రులు కూడా పరిచయం కావడంతో నేను తరచు వాళ్ళింటికి వెల్లేవాడ్ని. వెన్నెల జీవితం లోని చీకటి చూసాక ఆమె జీవితంలో పరిపూర్ణత రావాలంటే ఆమె మళ్ళి పెళ్లిచేసు కుంటే బాగుంటుంది అనిపించింది. తన భర్తను ఎంత ప్రేమించినా, జీవితాన్నిమోడులాగే గడిపెయాలనే నిర్ణయానికి తను రాకపోయి ఉండచ్చు. తన అభిప్రాయాల్నిగౌరవించే వ్యక్తి దొరికితే బహుశా చేసుకుంటుందేమో! వాళ్ళ తల్లిదండ్రులతో, అత్తమామలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. అదే విషయం అనుపమతో అన్నా."నీవు ఆ అమ్మాయి వ్యక్తి గత విషయాల్లో కల్పించు కుంటున్నావేమో ,అంత తెలివైన అమ్మాయికి ఇంకొకరు తన వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవడం నచ్చక పోవచ్చు పైగా ఇది చాలా సున్నితమైన విషయం."అంది.

ఆక్షయ్ మాత్రం "అంత స్నేహం ఉందిగా మీకు ఆ కుటుంబంతో, ఇష్టం లేకపోతే లేదంటారు కానీ సిల్లీగా ఆ టాపిక్ తెచ్చినందుకు మీ పట్ల ఏ వ్యతిరేకత రాదనుకుంటా" అన్నాడు ."నువ్వు చెప్పు ఆక్షయ్ అలాంటి అమ్మాయిని ఇష్టపడని వాళ్లుంటారా?"
“చూస్తే కానీ చెప్పలేను "అన్నాడు.
"అయితే ఎప్పుడొస్తావు ?" అన్నా.
"త్వరలో."
"ఆత్వరలో ఎప్పుడు?"
గట్టిగా నవ్వాడు ఆక్షయ్. "సరే మీకు ఆ అమ్మాయి అంత నచ్చిందంటే ఇంక మీదే ఆఖరి నిర్ణయం." అన్నాడు .
"నువ్వురావాలి ఒక వారం కోసమైనా"అన్నాను.
మధు, నేను, వెన్నెల పునర్వివాహం గురించి తల్లి దండ్రుల తో అత్తమామలతోమాట్లాడాము.వాళ్ళు మనస్పూర్తిగా అంగీకరించారు. వెన్నెలకు నచ్చిన వ్యక్తి దొరికితే తమకెంతో సంతోషమని,అదే తాము కూడా కోరుకుంటున్నామని అనడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వెన్నెల తో మాట్లాడ్డం గురించి రిహార్సల్ చేసుకున్నా. ఎలా మాట్లాడితే, ఎలా మొదలెడితే బాగుంటుందో అని తెగ ఆలోచించా ...ఆక్షయ్, అనుపమ నేను వెళ్ళాం, వెన్నెల ఇంటికి. ఆమె అప్పుడే బయటికి వెళుతోంది ఫ్రెండ్ పెళ్లి కని. ఎంత చక్కగా అలంకరించుకుందో !...ఆక్షయ్ కళ్ళు మెరిసాయి వెన్నెల్ని చూడగానే. అది నేను గ్రహించాను. వెన్నెల రెండు గంటల్లో వచ్చేస్తానని, భోంచేసి వెళ్ళమనికోరింది . ద్రువ్ మారాం చేస్తుంటే మేము తెచ్చినచాక్లెట్లు ఇచ్చిమాతో లోపలి తెచ్చాము. వెన్నెల తల్లి దండ్రులు అత్తమామలు వియ్యంకులుగా కాక స్నేహితుల్లా వుండడం మాకు బాగా అనిపించింది. అందరం భోంచేసి వెన్నెల కోసం ఎదురు చూసాం .వెన్నెల వచ్చాక ఆక్షయ్ ను పరిచయం చేశా.
"మిమ్మల్ని చూడకపోయినా మీ గురిం చి సర్ చెబుతూనే వుంటారు " అంది.

"మిమ్మల్ని చూడకపోయినా మీ గురిం
"మీ గురించి కూడా నాకు చెబుతుంటారు అందుకే మీరు నాకు క్రొత్తగా లేరు." అన్నాడు అక్షయ్. ఇద్దరూ సాహిత్యంలో కొత్త పోకడల గురించి మాట్లాడుతుంటే వింటూ వున్నాను.తర్వాత ఆక్షయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లి పో యాడు. అనుపమ నేను కూడా వీడుకోలు తీసుకున్నాము.
మరుసటి రోజూ ఆక్షయ్ తో అనుపమతో మాట్లాడాక వెన్నెల్ని కలిసాను. ”నేను మీ శ్రేయోభిలాషిని కదూ వెన్నెలా !"
మరుసటి రోజూ ఆక్షయ్ తో అనుపమతో మాట్లాడాక వెన్నెల్ని కలిసాను. ”నేను మీ శ్రేయోభిలాషిని కదూ వెన్నెలా !"
“అవును మీరంటే నాకు చాలా గౌరవం సర్, చెప్పండి. ”
“అయితే నేను చెప్పే విషయం కాస్త ఆలోచించండి"
“చెప్పండి"
"మీరు మళ్ళి పెళ్లి ఎందుకు చేసుకో కూడదు?"
వెన్నెల కాసేపు మౌనం వహించింది .“నాకా ఆలోచన ,అవసరం రాలేదు, నేను సంతోషంగానే వున్నాను సర్. ”
"మీకు తోడు నీడగా ఒక వ్యక్తి వుంటే ఇంకా బాగుంటుంది కదా ?"
"నాకు రాజ్ చనిపోతూ అతని తల్లిదండ్రుల్ని అప్పగించాడు , నన్నుస్వీకరించేదానికి సిద్దంగా వుండినా, వీళ్ళ బాద్య్హత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా వుండరు సర్, అది నాకు తెలుసు అందుకే, ఆ ఆలోచన చేయలేదు ’
“ద్రువ్ తో పాటు, మీబాధ్యతల్నిఅన్నిటిని సంతో షoగా పంచుకునే వ్యక్తి దొరికితే మీ కిష్టమేనా ?”
"ఎందుకో రాజ్ స్థానం ఇంకొకరికి ఇవ్వాలంటే నాకు చాలా భయంగా వుంది, అలాంటి ఆలోచనే భరించలేను.” ఆమె కళ్ళలో కన్నీరు బుగ్గలపై జారాయి.
“అయాం సారి వెన్నెలా, జీవితంలో రాబోయే రోజులు మరింత కష్టంగా వుంటాయి ఒంటరి తనంతో, మీ శ్రేయస్సుకోరి చెబుతున్నా. ఆక్షయ్ పై మీ అభిప్రాయమేంటి?”
“మీ అబ్బాయి ఆక్షయ్ గురించా! ఎందుకు?" కొంచం ఆశ్చర్యంగా అంది
" వెన్నెలా మిమ్మల్ని చూసిన క్షణంలోనే మీ అభిమానినైనాను, ఆక్షయ్ ఆలోచన విధానం ఈ కాలం పిల్లల్లా కాదు, వాడికి మీలాగే నాలాగే సాహిత్యం, సమాజ సేవ ఇంకా చాలా సున్నితమైన భావాలతో ఉంటాడు ..వాడికి తగిన అమ్మాయిని చూసే బాధ్యత నాపై పెట్టాడు. మిమ్మల్నిచూసాక మీరు నచ్చారు వాడికి ... మీకు ఇష్టమైతే మా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తున్నా" అది చెప్పాక నాకు మనసు తేలికైంది.
“అంత మంచి చదువు, వుద్యోగం వున్నఆక్షయ్ కి ఆన్నియోగ్యతలు వున్నఅమ్మాయి దొరుకుతుంది, నాపై సానుభూతితోనా ఈ ఆలోచన !" అంది వెన్నెల. ఆమె గొంతులో కొంచం నిరాశ ధ్వనించింది.
"మీలాంటి మంచి అమ్మాయిని ఆక్షయ్ కి చేసుకోవాలనుకోవడంలో సానుభూతి లేదు, స్వార్థం వుంది." వెన్నెల పలకలేదు. వెన్నెల్ని ఒప్పించేందుకు చాలా శ్రమపడ్డా. ఆక్షయ్ తో మాట్లాడాలి అంది. సరే అన్నా.
ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరి వదనాల్లో వున్నసంతోషం చూసి నాక్కూడా చాలా సంతోషమేసింది. అందరం రిజిస్టర్ ఆఫీసు కు వెళ్ళ బోయేముందు వెన్నెల అన్నయ్య అన్నాడు
ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరి వదనాల్లో వున్నసంతోషం చూసి నాక్కూడా చాలా సంతోషమేసింది. అందరం రిజిస్టర్ ఆఫీసు కు వెళ్ళ బోయేముందు వెన్నెల అన్నయ్య అన్నాడు
" ఆక్షయ్! నా చిన్నారి అల్లుడు ద్రువ్ ని నువ్వు బాగా చూసుకోవాలి వాడంటే మాకు ప్రాణం, ఎంతయినా మీ రక్తం కాదని ఏదైనా ఫీలింగ్స్ వుంటే నేను తీసుకెళతాను." ఆ టాపిక్ రావడం వెన్నెలకు నచ్చలేదు. నాక్కూడా నచ్చలేదు.
అయితే అక్షయ్ అదేమీ పట్టించు కోకుండా “రక్తo ఎవరిదన్నది ముఖ్యం కాదు, ఎవరు బాధ్యత తీసుకున్నారు అన్నది ముఖ్యం, మానాన్నకి నేను బయిలాజికల్ సన్ ని కాదు, మరి నన్నుఆయన ఎలా చూసుకున్నారో నాకు తెలుసు., ఆయన కంటే మంచి తండ్రి ఎవరికీ వుండరు. మానాన్నకు సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదు!" అన్నాడు ద్రువ్ ని చేతుల్లోకి తీసుకుంటూ. అవునా! అన్నట్లు చూసింది వెన్నెల నా ప్రక్క, అనుపమ ప్రక్క, నవ్వి తలవూపాo....వెన్నెల అందంగా, ఆనందంగా నవ్వింది. ఆ నవ్వుల్ని ఆక్షయ్ ఎప్పటికి వాడనివ్వడని నాకు తెలుసు.
No comments:
Post a Comment