(Published in Vishalakshi Oct 2011)
"ఎండలు చాలా ఎక్కువగా వున్నాయి వెళ్ళవలసిoదేనా?"పదోసారి అడిగాడు ఈశ్వర్. నవ్వితలూపాను, అతనికి తెలుసు ఒకసారి నేను నిర్ణయం చేసాక మార్పువుండదని, కానీ మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇవాళ ఉదయాన్నే రాధ ఫోన్ చేసింది. రాజేష్ తోనూ అత్తగారి తోను ఏదో విషయoలో గొడవ అయిందని వెంటనే రమ్మని, నిజానికి రాధ అంతసులభంగా గాయపడే రకం కాదు, రమ్మన్నది అంటే చాలా పెద్ద గొడవే అయివుండాలి, వెళ్లవలిసిందే. మా ఇద్దరి స్నేహం లో రాధ ఇలా నన్నుసలహా అడగడం, ఓదార్పు కోరడం ఇదే మొదటిసారి. టైఫాయిడ్ నుండి ఇపుడిపుడే కోలుకుంటున్న నన్ను రిజర్వేషన్ లేకుండా పంపడానికి ఈశ్వర్ కు ఇష్టం లేదు, రావడానికి అతనికి పనివుంది, ఎలాగయితేనేం కాచిగూడా -ఎగ్మూరు ట్రైన్ కి వెళ్ళడానికి స్టేషన్ కి వచ్చాము. సౌఖ్యంగా వుంటే తప్ప ఈశ్వర్ ప్రయాణానికి ఒప్పుకోడు. అతని ఆదుర్దా కి కారణాలు వెతకడం శుద్ధ దండగ ఒకపక్క కోపం వస్తున్నా ఆ లాలనకి, ప్రేమ కి నా గుండె పరవశిస్తూ వుంటుంది. నాకు రైలు ప్రయాణం ఇష్టం సామాన్య ప్రజల్ని చూస్తూ గమ్యం చేరుకోవడం బావుంటుంది. రైలుకిటికీలోంచి ప్రకృతి అందాలూ చూడడం లో ఉన్న ఆనందo ఎసి కూపే లో ఎలా దొరుకుతుంది?
చాలా రద్డ్డీగా వుంది ఎగ్మూరు జనరల్ కంపార్ట్మెంట్ ఎలాగో ఎక్కి కూర్చున్నా. చుట్టూ ఉన్న మనుషుల్ని పరిసరాల్ని చూస్తున్నాడు ఈశ్వర్.

"నేను ఇక్కడే వుండి పోవట్లేదు. నాల్గుగంటల్లో రాధ దగ్గరికి వెళ్ళిపోతాను."
"సరే జాగ్రత్త"నీళ్ళ బాటిల్ అందించి కదిలాడు. రైలు కదిలింది గోల గోల గా ఉన్న కంపార్ట్మెంట్ కాస్త సర్దుకుంది. చుట్టూవున్న ప్రజల్ని చూసాను, చాలామంది తమిళులే వున్నారు నిలబడ్డవాళ్ళు కూడా మెల్లిగా ఎక్కడో ఒకచోట ప్రాధేయపడి ఇరుక్కుని కూచున్నారు. ఆ సర్డుకోవడంలో నేను బెంచి చివరకి జారుతున్నాను. అతికష్టంమీద కూర్చున్నా. రాధకి ఫోన్ చేసి చెప్పాను రైలేక్కానని.
"హమ్మయ్య వస్తున్నావా!" అంది ఆ స్వరంలో బేలతనానికి నాకు ఆశ్చర్యం కలిగింది, అంత బేల కాదు రాధ, ఎందుకంత అలజడిగా వుంది?కుటుంబం లో సమస్యలకి అంతెక్కడ? జీవితం అంటేనే సమస్య్సలు ..., నవ్వొచ్చింది తనవరకు వస్తే గాని ఏది అర్థం కాదు, బయటి నుండి అందరికి సలహాలు చెప్పొచ్చు.
నా కాళ్ళకి దగ్గరగా ఒక పెద్దావిడ క్రిందచాప వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చుంది. చుట్టూ ఏవో సామాన్లు సంచులు పెట్టుకుంది. త్వరలోనే అక్కడవున్న వాళ్ళంతా ఆమె తాలూకు మనుషులే అని అర్థమైంది నాకు. కొడుకులు కోడళ్ళు మనుమలు మనుమరాండ్రు, మునిమనుమలు సైతం ప్రయాణం చేస్తున్నట్లుంది.అందరూ ఆమెను పైన కూర్చోమని అడిగినా ఆమె క్రిందనే నింపాదిగా గా కూర్చుంది. రైలు వేగం అందుకోగానే ఆమె తన చుట్టూ వున్నడబ్బా లోంచి లడ్డ్లు, చక్కిలాలు, తీసి కాగితంలో చుట్టి, ఒక్కకరికి ఏవి ఇష్టమో అవి అందించిoది. ఎక్కడా, ఎవరికీ తేడా రాలేదు, ఓ రెండేళ్ళ వాడిని వళ్ళో వేసుకుంది మరో నాలుగేళ్ళ వాడిని ప్రక్కనే పడుకోబెట్టుకుంది. చిన్నవాడికి పాలసీసాలో పాలు పట్టింది,పెద్దవాడికి గ్లాసులో పోసి తాగించింది. ఆమె మాట్లాడే తమిళ బాష రాకున్న ఆమె అందర్నీ తినమని చెబుతోందని అర్థమైంది నాకూడా చక్కిలాలు, లడ్డు పేపర్లో చుట్టి ఇచ్చింది. శుబ్రంగా లేని అమెచేతులు చూస్తూ కాసేపు సందేహించి అ కళ్ళలో ప్రేమకి చిక్కుబడి పోయి తీసుకున్నా, హమ్మయ్య ఈశ్వర్ లేడు, వుంటే ఇంకేమైనా వుందా దేట్టోల్ తో చేతులు కడుక్కోకుండా అరటిపండు కూడా తిననివ్వడు ఇంక ఈమెను చూస్తేఏమైనా ఉందా!
ఆమె బంధువర్గమంతా బాధ్యతంతా ఆమె పై వేసి నిశ్చింతగా కబుర్లలో పడ్డారు. చిన్నగా తమిళంలో ఓ జోలపాట పాడి చిన్నవాడ్ని నిద్రపుచ్చింది, ఆపాట ఎంత అనునయంగా పాడిందంటే వాడు అంత గొడవ లొనూ నిద్రపోయాడు. మరో పిల్లాడికి ఏవో కబుర్లు చెబుతోంది, మళ్ళీ కాఫీలు మొదలయ్యాయి సంచిలోంచి ఓ పెద్ద ఫ్లాస్క్ తీసి అందరికిప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ ఇచ్చింది. ఇంద్రజాలికుడు తన సంచి లోంచి ఎన్నో వస్తువులు తీసి అందర్నీ సంబ్రమపర్చినట్లు అందరికి ప్రణాళిక బద్దంగా ఏవేవో ఇస్తూనే వుంటే ఆశ్చర్యం కల్గుతోంది ఈవిడగాని మన దేశానికీ ఫినాన్సుమినిస్టరయితే దేశం బాగుపడుతుంది అనిపించింది. పిల్లల్ని లాలించడం దగ్గర్నించి టీనేజర్స్ ని మందలించడం దగ్గరనుంచి కొడుకులు కోడళ్ళని హెచ్చరించడం, అన్ని ఎంత సహజంగా ఎంత హుందాగా వున్నాయో, ఆమె ఆజ్ఞ ను కానీ సలహాను కానీ ఎవ్వరు తీసివేయడంలేదు. హైదరాబాదు నుండి కర్నూల్ చేరే వరకి ఆమెనే చూస్తూన్నాను. ఆమె ప్రతి కదలిక, ప్రతి మాట వేద వాక్కులా ఆకుటుంబం ఆచరిస్తుందంటే ఆమె త్యాగం, సహనం , ప్రేమ నిచ్చేతీరు ఓహ్ ....నలిగిన ఆమె చీర, నెరసి రేగిపోయిన జుట్టు, ముడుతలు పడిన నల్లటి శరీరం, ఏమాత్రం చుట్టానికి బాగాలేని ఆమె రూపం వెనక ఎంత గొప్ప శ్రమైక జీవన సౌందర్యం వుందో నేను చూడగలిగాను దిగువ మధ్హ్త తరగతి కుటుoబ పెద్దగా ఆమెను చూస్తున్న కొద్దీ గౌరవం కలిగింది. ఎవరు గొప్పవాళ్ళు ? ఎక్కడుంటారు?జీవితచరిత్ర వ్రాయతగిన ప్రాపంచిక జీవితానుభవం ఆమెకు లేకపోవచ్చు, కానీ ఆమె తన కుటుంబానికి చేస్తున్న సేవను ఎలా అంచనా వేయగలం? అది సామాజిక సేవ కాదనగలమా?ఆ మదర్ ఇండియా నన్ను ఎంతో ప్రభావితం చేసింది. కర్నూల్ రావడం తో కళ్ళతోనే వీడుకోలు తీసుకున్నా ఆమెతో.
ఇల్లంతా నిశ్సబ్దంగా వుంది ..రాధ అత్తగారు ఎప్పటిలా చాలా సంతోషంగా లేకున్నా సాదరంగా ఆహ్వానించారు. భోంచేసేటప్పుడు కూడా మౌనంగానే వున్నారు రాధ, రాజేష్. పిల్లలు కూడా అల్లరి చేయకుండా ఏదో పని చేసుకుంటూన్నారు.మొత్తానికి అందరూ బాగానే కలత చెందినట్లున్నారు .రాధ నేను గదిలోకి వచ్చాము, నేను వెళ్లినపుడంతా రాజేష్ వెళ్లి హాల్లోని దీవాన్ పై పడుకుంటాడు.
" ఏంటి అంత తీవ్రంగా ఘర్షణ పడ్డట్టున్నారు, ఏమిజరిగింది? "అన్నా. రాధ బుగ్గలపై కన్నీళ్ళు జారుతూనే వున్నాయి ..కాసేపు నేనేమి మాట్లాడ కుండా వున్నాను. కాసేపయ్యాక అనునయంగా అడిగాను "ఏమిజరిగింది ?"

"ఇన్నేళ్ళుగా ఏనాడైనా నేను అత్తగారి గురించి కానీ రాజేష్ గురించి కానీ అసంతృప్తి గా వున్నానా?ఉద్యోగం చేసి సంపాదించి అత్తగారి చేతికిస్తాను, ఆమె ఏది చెబితే రాజేష్ అదే చేస్తాడు నేను అదే చేస్తాను ఆమె మాట దాటి పోము. ఆమె ఏది చెబితే అది జరగాలి ..ఇన్నేళ్ళయిన ఆమెకి నచ్చిందే చేయాలి మా పిల్లల విషయం లో కూడా ఆమె నిర్ణయాలే చెల్లాలంటే ఎలా? నేహకి ఎం. ఇ. సి చేరి ఐ.ఎ.ఎస్ చేయాలని ఇష్టం దానికి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇష్టం లేదు. అత్తగారేమో చదివితే అదే ఇష్టమవుతుంది అంటారు. అదేమో గొడవ చేస్తుంది ..అది చెప్పబోతుంటే ఈవిడ వినరు బై .పి. సి, చేర్పించాల్సిందే అంటారు.నాకు చాలా కోపం వచ్చి మీ పిల్లల ని మీకు నచ్చినట్లు చదివించుకున్నారు కదా నా పిల్లలని నాకిష్టం వొచ్చినట్లు చదివించు కోనివ్వండి అన్నాను. ఆమె మౌనవ్రతంతో పాటు సత్యాగ్రహం మొదలెట్టారు.రాజేష్ కు అమ్మ ఎంత చెబితే అంత అన్నిటికి ఆమెనే సమర్థిస్తారు. మామగారు వైద్యం అందక చనిపోయారని, నేహ పై ఆమె ఇష్టం, ఆదర్శాలు రుద్దటమేంటి? అన్నాను. దాంతో రాజేష్ కూడా నాతో మాట్లాడడం మానేసాడు. తిక్కరేగి నేను కావాలో అమ్మ కావాలో తెల్చుకోమన్నాను. ఆమాట కొస్తే అమ్మే కావాలి నీదారిన నీవు వెళ్ళచ్చు అన్నాడు. నాకు ఎవరున్నారు, అమ్మానాన్న లేని అనాధను" వెక్కి వెక్కి ఏడ్చ్చింది రాధ.
తల్లితండ్రి ని చిన్నపుడే కోల్పోయిన రాధ చాలా మంచిది, అన్నవదినలకి అనుగుణoగా పెరిగింది, సహనం తో పాటు ఇతరుల్ని అర్థం చేసుకోవడం బాగా తెలిసిన వ్యక్తి, అలాగే ఆమె అత్తగారు కూడా అంతే మంచిది రాధ ని సాంత కూతురి లాగే చూసింది, ఇద్దరు ఉద్యోగాలకి వెళితే పిల్లల్ని చూసుకున్నారు బాగా చదువుకున్నావిడ కావడం మూలాన రాధకి పిల్లలకి హోoవోర్క్ చేయించే పనికూడా వుండేది కాదు, నేహ స్కూల్ టాపర్ అవడానికి ఆమె కృషి ఎంతో వుంది. మరెందుకిపుడు ఘర్షణ మొదలయ్యింది? నాకు రైల్లో ముసలావిడ గుర్తుకొచ్చింది. కొడుకులు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాండ్రు అందరూ, మూడు తరాలు ఆమె ఆజ్ఞ ను జవదాటరని నాకు నాల్గు గంటల్లోఆమె ఎలా ఓ కుటుంబానికి ఆలంబనగా వుందో అర్థమైంది. అది సాధ్యమేనా అని ఈకాలం వాళ్ళు అనుకోవచ్చు కానీ సాధ్యమే,ప్రేమ,క్షమ తోనే అది సాధ్యం. ఇక్కడ గుడ్డిగా నా స్నేహితురాలిని సమర్థిస్తే వచ్చే నష్టం నాకు తెలుసు .. స్నేహమంటే నలుగురిలో సమర్థించినా వాళ్ళ తప్పుల్ని ఒంటరిగా వున్నపుడు, తెలపడం, దిద్దటం. నా మాట అంటే చాలా గౌరవం రాధకు. ఏంచెప్పినా వింటుంది.
"రాధా నేను చెప్పేది వినాలని, ఒప్పుకోవాలని కూడా అనను, నేను చెప్పేది నీకు నచ్చక పోవచ్చుకూడా ... " ఆగాను.

"అదేం లేదు,నీకంటే ఆప్తులు, హితులు నాకెవరు లేరు నువ్వు ఏమిచెప్పినా వింటాను " దీనంగా అంది .
"ఇక్కడ హక్కులు బాధ్యతల చర్చ కదా! ప్రేమ ఉన్న చోట బాధ్యత, బాధ్యత ఉన్న చోట క్షమ వుంటాయి, మీ అత్తగారికి మాత్రం హక్కు లేదా ఆమెఇష్టం వ్యక్తపరచడానికి? ఎల్.కే.జి నుండి పది వరకి ఆమె చూసుకుంది నేహ స్కూల్ టాపెర్ కావడానికి ఆమె కారణమని నీవే చెబుతున్నావు, హక్కుల గురించి కంటే భాద్యతలు తీసుకున్న దాని గురించి ఆలోచించు. అమెక్కువా, నేను ఎక్కువా అని రాజేష్ ని నీవు అడగటం తప్పు."
"నీవూ నన్నే అంటావా" ఉక్రోషంగా అంది.
"నన్నెందుకు రమ్మన్నావు రాధా ?" అన్నా.
"నా బాధ అర్థం చేసుకుంటావని, నేనేం చేయాలో చెబుతావని," అంది .
"అయితే విను, రాజేష్ కి నీవూ కావాలి, వాళ్ళమ్మ కూడా కావాలి. రాజేష్ చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఆమె ఎన్ని కష్టాలుపడి చదివించిందో నీకు తెలుసు, ఆమె ఎన్ని కోల్పోయిందో,ఎంత త్యాగం చేసిందో కూడా తెలుసు, అవి తెలిసి, కొడుకుగా తన బాధ్యతను రాజేష్ మరవనందుకు గర్వించు. నీవా ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెబుతాడు? అతని సమాధానం సరైనదే, కానీ అతనికి నీవంటే ఎంత ప్రాణమో నీకు తెలియదా? అమ్మే ఎక్కువ అంటే వుడుక్కోకు, రేపు రేవంత్ కూడా ఇలాగే ఆంటాడు అపుడు సంతోషమా? ఇవాళ నీవేక్కువని వాళ్ళమ్మని వదిలేస్తే, రేపు రేవంత్ కూడా అదే చేస్తాడుగా! అపుడు నీ పరిస్థితి ఏంటి? నేహకు ఇష్టం కానీ పని ఆమె చేయరు, నాకు తెలిసి, ఓ వారం పోయాక నేహ అయిష్టత కనపర్చితే ఆమెనే గ్రూప్ మార్పిస్తారనుకుంటా. కాకపోయినా నేహ చాలా తెలివైంది ఇప్పటికి బై పి సి చదవనీ, తర్వాత తనకిష్ట మైనట్లు, డిగ్రీ చేసి సివిల్స్ కి వెళ్ళచ్చు లేక వాళ్ళ నాన్నమ్మకు నచ్చినట్లు మెడిసిన్ చేసినా సివిల్స్ రాయొచ్చు అది పెద్ద విషయం కాదు, అప్పుడు అంతా సుఖాంతం కదా!. రాధా.. నీలో మంచితనం వుండటం వలెనే కాదు, మీ అత్తగారి మంచితనం వలన కూడా మీరింతకాలం సంతోషంగా వున్నారు, ఇది గ్రహించు. మాకిలాంటి పెద్ద దిక్కు లేక మేమెంత కష్టపడుతున్నామో నీకు తెలుసు. స్నేహితురాలివని నిన్ను సమర్థిస్తే కుటుంబ వ్యవస్థపై గౌరవం లేని దాన్నవుతాను."
రాధ మౌనంగా వుండి పోయింది, కాసేపు అయాక, "నిజమే, అత్తగారి పై నా కోపం అర్థం లేనిదే, ఆమెకి మేము తప్ప ఎవరున్నారు? నేహాకు నచ్చ చెబుతాను.రాజేష్ తో అలా అనకుండా ఉండాల్సింది, గాయపడివుంటాడు. సారీ చెబుతాను .. నీవు వెళ్లి పిలు..." తానుగా పిలవడానికి సిగ్గుపడింది.
"రాధ పిలుస్తోంది." రాజేష్ కి చెప్పి, రాజేష్ అమ్మగారి గది లోకి వెళ్ళాను.అమేదో రాస్తున్నారు రీడింగ్ టేబుల్ దగ్గర.
"ఆరోగ్యం బావుందామ్మా?" అన్నారు.
"బావుందమ్మా ..
"ఏమిటీ వ్రాస్తున్నారు?"అన్నాను
"నేహ అప్లికేషను ఫిల్ చేస్తున్నా, అయిపొయింది, ఫోటో అతికించాలి" అన్నారు.
"ఇటివ్వండి, నేను అతికిస్తాను " అని తీసుకుని ఫోటో అతికించి, యాదృచ్చికంగా, గ్రూప్ వాంటెడ్ చూసా, ఎం.ఇ.సి అని వుంది. హాట్స్ ఆఫ్ టు మదర్ ఇండియా! అనుకున్నా మనసులోనే. అంతలోనే" మజ్జిగ అత్తయ్యా " అంటూ రాధ వచ్చింది. మెరిసే కళ్ళతో ఆమె అందుకోవడం చూసాక, ఇక్కడ ప్రేమలు మాత్రమే వున్నాయనిపించింది. నా ప్రయాణపు అలసట, టైఫాయిడ్ తో వచ్చిన నీరసం అన్నీ పోయాయి. నా ఆనందాన్ని నా ప్రాణమైన ఈశ్వర్ కి వెంటనే చెప్పడానికి ఫోన్ తీసుకున్నా.
No comments:
Post a Comment