Friday 2 November 2012

గమ్యం


గమ్యం  
నా  దగ్గర చదువుకున్న విధ్యార్థు లంటే  నాకు ఎంతో అభిమానం .బయటకు  వెళ్ళినప్పుడు నేను గుర్తు పట్ట  లేక పోయినా వాళ్ళు నా దగ్గర చదువుకున్న వాళ్ళమని గుర్తు చేసి పలకరిస్తారు . విద్యార్థుల తో నేను ఎంతోసంతోషంగా వుంటానుఇంకా కల్మషం చేరని  స్వచ్చమైన హృదయాలతోవుంటారుమనం  గురువుల దగ్గర నుండి నేర్చుకున్నట్లే  కొన్ని సార్లు మనవిద్యార్థుల దగ్గర నుండి కూడా నేర్చుకునే విషయాలుంటాయిఎమ్మేరెండోసంవత్సరం  చదువుతున్న తన్వి  చాలా  తెలివైన అమ్మాయినా కెంతోఇష్టమైన  విద్యార్ధిని.  మేమిద్దరం ఎందుకో గాని మొదటి పరిచయం లోనేఆత్మీయులం అయాము ..మా మధ్య స్నేహం నెమ్మదిగా పెరగ సాగింది .తన్వి కి కుతూహలం చాలా ఎక్కువబాగా ప్రశ్నించేది.  యూనివర్సిటీ లో నాతో ఎక్కువ సమయాన్ని గడిపేదిసాహిత్యం గురించి అడుగుతూ.ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్ లో వాళ్ళ కున్న నవలలన్నీఎంతో ఇష్టంగాచదవడమే కాకుండా వాటిని సినిమాలుగా తీయడం తో  సీడీలన్నిఎంతోకష్టపడి తెచ్చిందిఎంతో ఉత్సాహంగా అందరితో అవసరమైనంత చనువుతోమెలిగేదినాకే కాదు తన్వి స్టాఫ్ అందరికి ఇష్టంఎమ్మే మొదటి సంవత్సరం లో  ఉన్నప్పుడే  తన్వి కి తరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో  పెళ్లినిశ్చయమయింది . ఇద్దరూ ఈడు జోడు గా ముద్దుగా వున్నారు.  తన్వినిశ్చితార్థానికిమా ఉపాధ్యాయ బృందం  మరియు విధ్యార్తులందరంవెళ్ళాము . 
మేము  చదువుకున్న రోజుల్లో లాగా  ఇప్పుడు  విద్యార్థులకు ,   ప్రొఫెసర్లంటే  భయాలు లేవు , స్నేహపూరిత మైన వాతావరణం నెలకొనింది.  నేను ,మిగతా  స్టాఫ్హెడ్ కూడా విద్యార్థుల్ని స్నేహితుల్లాగే  చూస్తాము .అప్పుడప్పుడు  తన్విని  కలవడానికి తరుణ్  యూనివెర్సిటి కి  వచ్చేవాడు.  స్టాఫ్  రూం లో  మా పర్మిషన్  తో  కాసేపు మాట్లాడి వెళ్లి  పోయే వాడు.    అయితే  స్టాఫ్  రూం లో మాట్లాడ్డం తప్ప తన్వి అతను వెళ్ళేప్పుడు   బయటికి  కూడా  వెళ్ళేది  కాదు , బాగా మాటకారి అయినా తరుణ్ తో చాలారిజర్వడ్ గా ఎంతో హుందాగా ప్రవర్తించేది
 తన్వి కి  సరిగ్గా పరీక్షలకు ఒక్క రోజు ముందే పెళ్లి   నిర్ణయించారు. ,తరుణ్ అమెరికా  వెలుతున్నాడట,  మళ్ళీ సంవత్సరం వరకు  రాలే డని  అలానిర్ణయించారటపెళ్లి  అయిన  మరుసటి   రోజే  పరీక్షలు   మొదలవుతాయి . బాగా  చదివే  తన్వికి  అదేమంత కష్టం   కాక పోయినా ,  సరదాగా  ఉండకుండా    పరీక్షలు  ఇబ్బంది  పెడతాయి  కదా అనుకున్నా ! "పోనీ మళ్ళి రాద్దువు గానీలే "  అన్నాను  తన్వితో . 
"లేదు మేడం ,  సరదాకి  జీవితం  అంతా వుంది,  ఎమ్మే పరీక్షలు  జీవితంలో  ఒకే సారి  వస్తాయి,  నా  కెరీర్ ని  నిర్ణయించే  నా పరీక్షల్ని నేను వదులు  కునే  పరిస్థితే  లేదు"  అంది .     అమ్మాయి  ఆత్మస్థైర్యం  నాకు  చాలా  ఆశ్చర్యంగా వుంటుంది .
ఎమ్మే  ఫైనల్  సెమిస్టర్  నాల్గు రోజులు  వుండగా  పిల్లలు మహానంది పిక్నిక్  ప్లాన్  చేసారు.  హెడ్  అఫ్   డిపార్ట్మెంట్  ను  ఎలాగో నచ్చ జెప్పి వప్పించేసారు.పెళ్లి  దగ్గరలో  వుండటం  తో  షాపింగ్  పనులతో తన్వి  రాలేనంది . తన్వి  రాక  పోతే  నాకు  వెళ్ళాలనిపించలేదు  కానీ  స్టాఫ్ ఎవరూ  పోక  పోవడం  తో  నేను వెళ్ళాల్సి  వచ్చింది . మేము  బయలు దేరుతుండగా తన్వి  ఫ్రెండ్స్ ని  కలవడానికి  వచ్చింది.  స్నేహితులందరూ నువ్వు  వస్తే   బావుంటుంది  అన్నప్పుడు  తన్వి  కూడా  ఆలోచనలలో పడింది ,      
 "సాయంత్రం కి  వచ్చేద్దామా ! తరుణ్  తో  షాపింగ్ వుంది ,  సాయంత్రం కి  రాగలను  కదా!"  అంది.                                       
"వచ్చేద్దాం నువ్వు వస్తే తొందరగా వెనక్కి వచ్చే పూచి నాదిక్లాస్ లీడర్   వాగ్దానం తో ...  వాళ్ళ  నాన్న  గారిని సులభంగా కన్విన్స్  చేసింది. తన్వినిర్ణయాలు,  కన్విన్స్ చేసే  విధానం  ఆన్ని   నాకు  ముచ్చటేస్తాయి.  నేనుమెచ్చుకున్నప్పుడంతా  తన్వి "ఇదంతా  మా నాన్నగారి నుంచి నేర్చుకున్నా " అనేది . మహానంది కి తన్వి  మాతో  బయలు  దేరింది మినీ బస్సులో.  తొందరగా  తిరిగి రావడానికి  వీలుగా తన్వి  కార్  మా  బస్సువెనకాలే డ్రైవర్  తీసుకొచ్చాడు . పాటలు ...ఆటలు ..పిల్లల అల్లరితోసరదాగా సాగుతోంది . దారిలోతన మహానంది ప్రయాణం గురించి చెప్పడానికి తన్వి  తరుణ్  కు  ఫోన్  చేస్తూనే  వుంది స్విచ్డ్ ఆఫ్   అని  వస్తోంది   తను  పిక్నిక్  వెళ్ళే   విషయం  అతనికి   చెప్పాలని   తను  పడుతున్న అవస్థ  చూసి  "ల్యాండ్  లైన్ కి ,వాళ్ళ  ఇంటికి  చెయ్యి"  అన్నాను,  కాబోయే  అత్త  గారికి ఫోన్   చేసింది , ఎవరో  ఫ్రెండ్  వచ్చారు బయటికి  వెళ్ళాడు  అని చెప్పారు ఆవిడ . తను  పిక్నిక్  వెళుతున్నట్టు తన్వి ఆమెకు  చెప్పింది .                                                                                 
ఎందుకు చెప్పావు వాళ్లకు,పెళ్లి  ముందు  బయటికి వెళ్ళడం  నచ్చక  పోవచ్చు  కదా " అన్నాను , 
"ఎందుకు  దాచాలి?  ఎందుకు  భయ  పడాలి?  నేను  చేస్తున్నది  ఏదైనా  క్లియర్  గా  వుండాలని కోరుకుంటాను.  నా  స్వేఛ్చ ను  ఎప్పటికి  కాపాడు  కోవాలంటే  నేను  చేస్తున్నవన్నీ   ఓపెన్ గా వుండాలి.  ప్రైవసీకి  సీక్రసికి   వున్న  తేడా చెప్పారు కదా  నెహ్రు  లెటర్స్ తో హిస్డాటర్ లో "అంది.                                               

 "నేను నీకు పాఠాలే చెప్పాను కానీ నువ్వు వాటిని ఆచరించి చూపుతావు"  మనస్పూర్తిగా మెచ్చుకున్నాను. మహానంది   వెళ్ళాక  స్టూడెంట్స్అందరూ ఆడుకుంటూ  వుంటే  నేను  తన్వి అలా  అందమైన  ప్రకృతిని  చూస్తూ  అలా  గుడి  లోపలకు  వెళ్ళాము  లోపలున్న  కోనేట్లో  నీళ్ళు  ఎంత  తేటగా,పార దర్సకంగా  ఉంటాయంటే  ఒక సారి నా కాళ్ళ పట్టి పోగొట్టుకుంటే అన్నయ్య నీటి అడుగున   పడ్డ పట్టీని  తెచ్చింది గుర్తు వచ్చిందికోనేటి దగ్గరగా వెళ్ళాము  చల్లని  నీళ్ళలో  చాలా  ఆనందంగా  వున్నారు అందులో దిగినవాళ్ళు . అకస్మాత్తుగా నా కళ్ళు ఒక  జంటపై  పడ్డాయి  తరుణ్  చేతుల్లో    అమ్మాయి  పరవశంగా  అతని   బాహువుల్లో వుంది,  అతని చేతులు  ఆమె  చుట్టూ  పెనవేసుకుని హత్తుకుంటున్నాయి , ఒక్క నిముషం   నా కళ్ళు బైర్లు  కమ్మాయి  నా  చూపులు  పడ్డ చోటే   తన్విచూపులు  పడటం  తో  నాకు  ఒక్కసారిగా  ఏమీ  అర్థం 
కాలేదు . తన్వి  కళ్ళు  ఎరుపెక్కాయి.  పారదర్శకంగా  వున్న   నీళ్ళు  తరుణ్  నిజ స్వరూపాన్ని  చూపాయి  నిశ్చేష్టులయిన   మమ్మల్ని  తరుణ్ చూసాడు …కొయ్యబారిపోయి,  అప్పటి వరకు వేస్తున్న  కేరింతలు మాని తనతో  వున్నఅమ్మాయిని  వదిలి  గట్టుపైకి  వచ్చాడు  వెంటగా    అమ్మాయి కూడా  వెనకే  వచ్చింది .ఏదో  
హిందీలో  మాట్లాడుతూ. ."షి  ఇస్  మై  కలీగ్ రశ్మి ..మన  ప్రాంతం  చూడాలని   వచ్చారు ,  తనకి   నీళ్ళంటే  భయం  అందుకని"అతను  ఏదో  చెప్పబోతున్నాడు . ఆపు  అన్నట్టుగా  అరచేతిని  చూపింది  తన్వి ..ఇదేమి   
తెలియని  అమ్మాయి తరుణకు  దగ్గరగా వచ్చి  భుజాల చుట్టూ  చేయి  వేసి ఏదో అంది హిందీలో.  సున్నితంగా  విడిపించుకుంటూప్రక్కకు  జరిగాడు  తరుణ్.                                                          
తన్వి అతన్ని ఆమెను నిర్వికారంగా చూస్తూ  "అయాం  సారి  తరుణ్...   మన   పెళ్లి  జరగదు .."అంది.            ఒక్కనిముషం  నాకేమి  అర్థం  కాలేదుకానీ  నేను  కల్పించుకునే  విషయం  కాదు  కాబట్టి  నేను  కల్పించుకోలేదు  .
 "అదికాదు....తన్వీ  అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ అంతే " ..ఏదో  చెప్పబోతున్న  అతన్ని  వారిస్తూ….                      " హేట్ లయర్స్ సంగతి  నీకు  తెలుసు,  ఒక  స్త్రీ  పట్ల  నీకు  ఉద్దేశం వుందో   తెలుసుకోవడానికి   నాకు పెద్ద జీవితానుభవం అక్కర్లేదు తరుణ్, ఇంక నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం  చేయకు .కలుసు కోవడానికి  ప్రయత్నించకు...పద   మేడం వెళదాం ... "ఉబికి వస్తున్న కన్నీళ్లను కళ్ళలోనే   ఇంకి పోయేలా   చేసింది తన్వి.         
స్త్రీ విశ్వాసం మీద పురుషుడు చేసే అరాచకానికి తన్వి లాంటితెలివైన  అమ్మాయి కూడా బలి కావడం నేను  జీర్ణించు కోలేకపోయానుఅడుగు ముందుకు వేయడానికి కూడా శక్తి లేనట్లు కృంగి పోయాను అమ్మాయికి
ధైర్యంచెప్పాల్సిన నేను ఇలా అవడం ఏంటి ...? నెమ్మదిగా మనసును కుదుట  పరచుకుని నెమ్మది గా తన్వి చేతినినా చేతుల్లోకి తీసుకున్నాను.నామనోగతాన్ని చదివిన తన్వి ..."మీరు అప్సెట్ అవకండి మేడం ...అయాం ఆల్ రైట్ ...  ఇక్కడ నుండి వెళ్లి పోదాం "అంది
తరుణ్, తన్విని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయలేదుఅతనికి అర్థమైంది తన్విని తాను శాశ్వతంగా జార విడుచుకున్నానని .ఇద్దరం కదిలాం. " సారీ  తన్వీ నిన్ను  అనవసరంగా  తీసుకొచ్చి ” ఆగాను.                        
"మంచిపని  చేసారు  ఒక  హిప్పోక్రాట్  చేతుల్లోకి  నా  జీవితం  పోకుండా  ఆపారు “అంది .                               "నిజంగా  పెళ్లి ఆపేస్తున్నావా  ? ఆలోచించు  తన్వీ " దిగులుగా  అన్నాను.                                                         "మాడం ..మీరు  ఇంకా    ఫ్లర్ట్  ని  పెళ్లి చేసుకోమంటారా ! నో , ఇప్పుడే  నాన్నకి  ఫోన్  చేస్తాను " అంది 
 నాక్కొంచం  దిగులనిపించింది  మూడు  రోజుల్లో  పెళ్లి  వుంది  ఇప్పుడు  ఆగిపోతే .....శుభలేఖలు  ఇచ్చారు  షాపింగ్ చేసారుబంధువులు కూడా వచ్చారు ,ఇప్పుడు  తన్వి అమ్మ నాన్న  ఎలా తీసుకుంటారో ! నాకు తరుణ్ ని చూస్తే అసహ్యం వేసింది ...బంగారం లాంటి అమ్మాయిని పోగొట్టుకుని..... ఛి చీ ...మేలిమివజ్రాన్ని  వదిలి గాజు పెంకుల కోసం ప్రాకులాడతారు కొందరు . అల్ప మైన చిన్న చిన్న సుఖాల కోసం అద్భుతమైన ఒక భాగ స్వామిని పోగొట్టుకున్నాడు...బాంబేలో ఎట్లా తిరిగినా ఎవరికీ తెలియ లేదు ...ఇక్కడ కొచ్చినప్పుడైనా మర్యాదగా వుండి వుంటే  తన్వి లాంటి మంచి అమ్మాయి సాహచర్యం లభించిజీవితం సుఖమయం అయ్యేదిఎంత దురదృష్ట వంతుడు ! తన్వి అదృష్టవంతురాలు  , తరుణ్ నిజ స్వరూపం ఎవరూ తెలుసు కోలేక  పోయినా అతని లోనిదిగజారుడు వ్యక్తిత్వాన్ని తనంతకు తానే బయట పెట్టుకున్నాడు ......తన్వి  తో పాటు నడుస్తూ ఆలోచిస్తున్నాను .
"నాన్నా మా పెళ్లి పనులు ఆపేయండి....ఇంటి కి వచ్చాక మాట్లాడదాం...అవును ఒక బలమైన కారణం తోనే చెబుతున్నా ...అతన్ని అతని గర్ల్ ఫ్రెండ్ తోమహానంది కోనేట్లో చూశా అతని ప్రవర్తన లో నిజాయితి లేదునేను అతన్ని అంగీకరించలేనునిబ్బరంగా కృత నిశ్చయం తొ అంది తన్వి  నాన్నగారు ఏమన్నారో మరి నేను అడగలేదు.కానీ ఎలా బాధపడివుంటారో అన్నఆలోచన మాత్రం నన్ను వదలలేదు .మిగతా  స్టూడెంట్స్ కు జాగ్రత్త చెప్పి  తన్వి తోఆమె కారులో బయలు దేరాందారిలో మా మధ్య పెద్దగా సంభాషణ జరగలేదుకానీ తన్వి మనసులో జరుగుతున్న ఘర్షణ నాకు అర్థం అవుతోంది . పెళ్లినిశ్చయం అయాక కాబోయే భర్త పట్ల అనుబంధం ,ఆత్మీయత కలగకుండా ఎలా వుంటుంది ? పైగా సెల్ ఫోన్ లు వచ్చాక ఇప్పుడు మరింత చేరువయ్యేదానికిఅవకాశం ఉందిఎంత తొందరగా చేరువవుతున్నారో అంత తొందరగా విడిపోతున్నారుతన్వి దీన్ని ఎలా తీసుకుంటుందో ! ఇద్దరం ఏమీ మాట్లాడలేదు,  నన్నుమా ఇంటి దగ్గర దింపి వెళ్లి పోయిందితన్వి కి   ఫోన్  చేయడానికి కూడా మనస్కరించలేదు. పరీక్షలు  రాస్తుందో లేదో ! కాలమే తన్వి గాయాన్నిమాన్పాలిఅనుకున్నా.   
నాల్గవ  సెమిస్టర్ పరీక్ష  కు తన్వి వస్తుందో రాదో అన్న నా సందేహాన్ని పటా పంచలు చేస్తూ ఉత్సాహంగా పరీక్ష కు హాజరయ్యింది తన్వి.అంతేకాదు తనేయూనివర్సిటి ఫస్టు వచ్చిందిఅప్పుడు  నన్ను కలవ డానికి ఇంటికి  వచ్చింది . తన కళ్ళలోని మెరుపును ,ఆత్మవిశ్వాసాన్ని చూసి నాకు ఎంతో సంతోషంకలిగిందినా స్టూడెంట్ అయినా  , నా కంటే పదేళ్ళు చిన్నదయిన తన్వి ని చూసి  నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది . 
 "తన్వీ... బాధను నువ్వు ఎలా ఓవర్ కం చేయ గలిగావు ?”                                                                      "మీరింకా తరుణ్ ప్రవర్తనకి ...ఆగిపోయిన పెళ్లి గురించి అంటున్నారాఅది అవాళే మర్చిపోయా మేడం ...నావిలువ గ్రహించని వ్యక్తి గురించి నేను ఎందుకు బాధపడతాను మేడం ? ఏమి జరిగిందని నేను అంత బాధపడి ఏడుస్తూ కూర్చోవాలి ?నేనే కాదు మా ఇంట్లోఅందరూ తరుణ్ ప్రవర్తన పెళ్ళికి ముందే తెలిసినందుకు ,పెళ్లి ఆగిపోయినందుకు సెలెబ్రేట్ చేసుకున్నాము "నవ్వేసింది .                                                                                                తన్వి సమాధానం  నాకు  చెంప  పెట్టు లా  అనిపించింది .పదేళ్ళ క్రితం పొత్తిళ్ళలో బిడ్డతో,  నైతిక విలువలులేని సుమన్ తో విడిపోయిన నేను ఇంకా వ్యర్థమైన ఆలోచనలతో  అతను చేసిన గాయాన్ని మోసాన్ని తలుచు కుంటూ జీవితాన్ని నిరాశ నిస్పృహలతోగడిపానుగడుపుతున్నానుఅతనేమో  విలాసాల తేలుతూ ఆనందంగా జీవిస్తూ వుంటే నేను  జీవితాన్ని ఎపుడెపుడు ముగిద్దామా అన్న వేదాంత ధోరణిలోజీవితాన్ని లాగుతున్నాను . ప్చ్  తన్వి  నుంచి  ముందు నేను నేర్చుకోవాల్సింది చాలా వుంది."మన విలువల్ని గుర్తించలేని వాళ్ళకోసం మనం ఎందుకుఏడవాలి ?" ఎంత మంచి మాట ! ఎంత విలువైన సందేశం ! నిజాన్ని గ్రహించేదానికి రుషులదగ్గరికివేదాంత గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు .జీవితం విలువ తెలిసిన యిరవై ఏళ్ళ తన్వి చాలు అనిపించింది .విలువలు లేని ప్రేమ ఎంత నిరర్తకమో అర్థమైంది .మనది కానీ వాళ్ళ పై ప్రేమ కల్గివుండడంఎంత మూర్ఖత్వమో కూడా అర్థమైంది .తన్వి   నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని  ఆప్యాయంగా నొక్కింది . "ఏమిచేస్తావు తన్వీ ? జాబ్చేయాలను కుంటున్నావా లేక చదవాలనుకుంటున్నావా?  “                "మనకు దగ్గరగా వున్నసామాన్య మైనవి మన కళ్ళకు చేరువయిదూరంగావున్నవిలువైన వాటిని చూడ నీయకుండా చేస్తాయి.చిన్నచిన్నప్రలోభాల వెంట పరిగెత్తేవారికి ఉన్నతమైన విలువలుధ్యేయాలు కనపడవునేను కూడా పెళ్లిఅనే దాన్నిపెద్ద అవసరంగాజీవిత ధ్యేయంగా భావించాను ,అందుకే అమ్మా నాన్న మంచి సంబంధం , చేసుకోమని చెప్పగానే ఒప్పుకునేశా !చదువును సీరియస్గా తీసుకోలేదు ...కానీ నేను  సంకుచిత భావాల నుండి బయట పడాలి. చదవాలి..ఉన్నత మైన చదువు ద్వారానే ఉన్నతమైన స్థానం సంపాదించుకోగలను ,దాని ద్వారానే  సమాజానికి పనికి వచ్చే పనులు చేయగలను . సివిల్స్ ప్రిపేర్  అవుతున్నాను ,ఢిల్లీ వెళుతున్నామేడంమీ విషష్ కోసం వచ్చాను.”                                       
 "నీ ఆశలుఆశయాలు ఉన్నతమైనవి ...నీవు కోరుకున్నగమ్యాన్ని అతి త్వరలో చేరుకుంటావు.నా ఆశ్సీస్సులుఎప్పుడూ నీ చెంత వుంటాయి." సంతోషంతో , కొంచం బాధతో వీడుకోలు పలికానువెళుతున్న తన్వి  నా విద్యార్ధి లా అనిపించలేదు నాకు జీవిత సారాన్ని బోధించి వెళుతున్న మహాజ్ఞానిలా అనిపించింది