(Published in Vishalakshi Sep2012)
"ఇవాళ ఖచ్చితంగా మనకు విషయం తెలుస్తుంది " భార్య వదనం లోని దీనత్వానికి అతని మనసు చెదురు తుండగా అన్నాడు ఆనంద్.
అతనికేసి చూసి, కళ్ళలో తిరిగిన కన్నీటిని భర్త చూడకుండా తల వాల్చేసింది. కానీ అప్పటికే జారిన కన్నీరు ఆమె బుగ్గల పైకి పాకాయి. అతనికి గుండె పిండి నట్లైంది. పెళ్లినాటి ప్రమాణాలను ఆయన ఏనాడు మరువలేదు. రాధ పరిచయమయినప్పటి నుండి ఈనాటి వరకు ఆమెను ఎంతో ప్రేమగానే కాదు, ఎంతో గౌరవంగా కూడా చూసాడు. ఆమె అభిరుచుల్ని,ఇష్టాలని గౌరవించాడు, ఆమె తల్లి దండ్రుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, తనవారిని ఆదరించినట్లే ఆదరించాడు. ఆమె కోరక ముందే ఆన్ని సమకూర్చాడు. ఒక మంచి స్నేహితురాలిగా మొదలైన ఆమె ఆగమనం అతని జీవితాన్ని పూలవనంలా చేసిందని అతనెప్పుడూ అనుకుంటాడు. దగ్గరయిన కొద్ది దూరమయే అనురాగం కాదు వారిది. ఆకర్షణతో మొదలైనా, వారి ప్రేమ, వివాహoతో మరింత అవగాహనతో, పటిష్టమైన బంధంగా మారింది. అతను ఆమె కిచ్చే ప్రాధాన్యతను చూసి ప్రతి ఒక్కరు, రాధ అదృష్టాన్ని చూసి ఈర్ష్య పడే వారు. రాధ తన ప్రేమ దేవత అని తన జీవితం లో రాధ ప్రవేశమే ఒక గొప్పమలుపని అతను తన స్నేహితులతో అనేవాడు. రాధ తల్లి కాబోతుందని తెలిసినప్పుడు, అతను ఆనంద పడ్డం కంటే ఆమె వేవిళ్ళకు కంగారు పడ్డాడు, ప్రసవం లో ఆమె కేమవుతుందో నని వేదన పడ్డాడు. ఒక బిడ్డ చాలని బిడ్డ పుట్టక ముందే రాధకు కూడా చెప్పకుండా ఆపరేషను చేయించుకున్నాడు. ఆన్నిరకాలుగా రాధను ఆనందపెట్టే విధంగాను, కలత పడకుండా చేయగలిగిన ఆనంద్ కుమార్ .. తన సాంత కొడుకు విషయంలో వచ్చిన, కష్టాన్ని పోగొట్ట లేకపోతున్నాడు.
ఆనంద్, రాధల కొడుకు సుజన్ ని అందరి తల్లి దండ్రులలాగే అపురూపంగా పెంచినా, గారాబం చేయలేదు. క్రమశిక్షణ తో పాటు చదువు, సంస్కారం కూడా అలవడే విధంగా వుండేది వాళ్ళ ఇంటి వాతావరణం. ఆనంద్ తల్లి దండ్రులు, చెల్లలు భాను, రాధ తల్లి దండ్రులు, రాధ అన్నయ్య రమేష్, చెల్లెలు గీత తరచు రావడం మూలాన అందరూ కలసి మెలసి వుండే వాళ్ళు. అందువలన సుజన్ సమిష్టి కుటుంబ వాతావరణం లో అసూయ, ద్వేషాలు, అబద్రత లేని బాల్యం తో ఆరోగ్యంగా పెరిగాడు, భాను పిల్లలు, రమేష్ పిల్లలు, గీత పిల్లలు అందరూ సెలవుల్లో ఎక్కడో ఒక చోట కలుస్తూ వుండటం వలన, ఒక్కడే కొడుకు అయినా సుజన్అన్నిటిని అందరితో పంచుకునే వాడు. చదువులో కూడా బాగా ముందుండే వాడు.
ఇంజనీరింగ్ అయిపోయాక ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళతాను అన్నప్పుడు రాధ వ్యతిరేకించింది, ఇండియాలో లేని చదువులా అని. కానీ ఆనంద్, "ఈ కాలం పిల్లలకు మనకు ఎంతో తేడా వుంది ...వాళ్లకు నచ్చిన చోట, నచ్చిన చదువు, చదవనీ..ప్రపంచం చూడనీ, ఆన్ని బాషలు, సంస్కృతులు తెలుసుకోనీ, అప్పుడు కదా వాడికి మంచి చెడు తెలిసేది"అన్నాడు.
రాధ అయిష్టంగానే కొడుకును పంపింది.వెళ్ళాక రోజూ ఫోన్ చేస్తూ వుండటం వలన కొద్ది రోజుల్లోనే రాధ, ఆనంద్ లకు కొడుకు దూరంగా వెళ్ళాడనే దిగులు పోయింది. సుజన్ పదినెలలు తర్వాత వచ్చి నెల పాటు వున్నాడు. ఆరోగ్యంగా పసిమి ఛాయ తో వున్న కొడుకును చూసి రాధ,అమెరికాలో సుజన్ ఇబ్బంది పడకుండా చక్కగా తాను కోరుకున్నచదువు, చదువు కుంటున్నందుకు సంతోష పడింది. అక్కడి వింతలు, విశేషాలు జీవన విధానాలు,స్నేహితుల కబుర్లు చెబుతూ వుంటే ఆసక్తిగా విన్నది, అమెరికా వెళ్లి, సుజన్ పార్ట్ టైం వుద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో రాధకు కొన్న ముత్యాల దండ చూసుకుని మురిసి పోయింది. రాధ సంతోషంగా వుండడం చూసి ఆనంద్ కూడా తేలిగా ఊపిరి పీల్చు కున్నాడు.
తర్వాత సుజన్ నుండి ఫోన్లు తక్కు వయాయి ...ప్రాజెక్ట్ వర్క్ తో బిజీ గా వున్నానని అనడంతో,సర్దుకున్నారు, ఏంటో తేడాగా వుందని, రాధ అన్నప్పుడు అదేమీ వుండదులే , చదువు, పరీక్షలు, ప్రాజెక్ట్, మళ్ళి పార్ట్ టైం వుద్యోగం ఇన్నిటి తో సమయం లేక, అమెరికా -ఇండియా టైమింగ్స్ కుదరక అని నచ్చ చెప్పినా, ఏదో అసంతృప్తి ఆనంద్ ని కూడా వేధించేది, చదువు అయిపోయాక వచ్చేస్తే కళ్ళ ముందు ఉంటాడు కదా ..ఎందుకు ఏవేవో ఆలోచనలు చేయడం అని సర్ది చెప్పుకున్నాడు. సుజన్ చదువు అవగానే వెంటనే వుద్యోగం దొరికింది అని ఇండియా కూడా రాలేదు. అక్కడ వుద్యోగం వద్దు వచ్చేయమని చెప్పిన తల్లి దండ్రులకు, మంచి కంపెని లో వచ్చిన వుద్యోగం వదులు కోవడం ఇష్టం లేక చేరాను, త్వరలో ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయించు కుంటానని చెప్పి కొంతకాలం మభ్య పెట్టాడు. సుజన్ నెల కొక్కసారి ఫోన్ చేయడం, ...ఎందుకు ఫోన్ చేయడం లేదని గట్టిగా అడిగితే ఫోన్ పెట్టేయడం, వీళ్ళు ఫోన్ చేస్తే తీయ కుండా ఉండడంతో..ఆనంద్, రాధ తీవ్రమైన ఆవేదనకి గురయ్యారు. రాధ ఆనందం కోసం ఏ కష్టమైనా ఎదుర్కునే ఆనంద్ ...చట్రం లో ని చెరుకు గడలా నలిగి పోయాడు. ఎప్పుడూ నవ్వుతూ అందరికి సంతోషాన్నిపంచే ఈ జంట నిరాశగా, నిర్వేదం తో వుండడం అందర్నీ విచారానికి గురిచేసింది. సుజన్ కారణంగా ఇలా అవుతున్నారని తెలిసినా ఎవరూ ధైర్యం చేసి అడగ లేక పోతున్నారు. సుజన్ స్నేహితులెవరి తోను కూడా మాట్లాడక పోవడం, సెల్ నంబర్ మార్చడం మరింత అనుమానాన్ని రేకెత్తించింది. పదినెలలు గడుస్తున్నాసుజన్ నుంచి ఫోన్ లేదు. ఏమి జరిగిందో అర్థం కాక మరింత క్షోభ కు గురయ్యారు.
సుజన్ కు ఏమయ్యిందో, ఎందుకిలా చేస్తున్నాడో తెలిస్తే తప్ప రాధని ఓదార్చలేనని ఆనంద్ కు అర్థమైంది. సుజన్ క్షేమం కంటే కూడా ఆనంద్ కు రాధ గురించే ఎక్కువ దిగులయ్యింది.ఎప్పుడు లేనిది ఆమె ఆనంద్ నుండి కూడా దూరంగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఆనంద్ లీవ్ పెట్టేసి సుజన్ ఎక్కడున్నది, ఏం చేస్తున్నది కనిపెట్టడానికి ఢిల్లీ వెళ్ళాడు, ఫ్రెండ్ సహాయం తో ఎంబసిలో వివరాలు కనుక్కున్నాడు. అమెరికా వెళ్ళడానికి వీసా దొరకడం అంత సులభం కాదు అది కూడా ఇన్విటేషన్ లేకుండా ....టూరిస్ట్ గా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు, రాధ కూడా వస్తాననడంతో తప్ప లేదు. ఎంబసి నుండి తీసుకున్న వివరాలతో కాలిఫోర్నియా లో అడుగు పెట్టారు. క్యుపెర్టినో , పెబుల్ ప్లేస్ దగ్గరకు వచ్చాక10682 ఇంటి నెంబర్ చూసి వణుకు తున్న చేతులతో కాలింగ్ బెల్ నొక్కారు .... ఎవరో వచ్చి తలుపు తీసారు ... పొట్టి నిక్కరు వేసుకుని, టి షర్టు వేసుకుని బొద్దుగా వున్న ఒక పాతికేళ్ల అమ్మాయి, "ఎవరు కావాలి?" అంది ఇంగ్లీషులో.
".మేము ఇండియా నుండి వచ్చాము ఇక్కడ సుజన్ అనే అతను వున్నాడా?" తూలి పడబోతున్న రాధను పట్టుకుంటూ అడిగాడు.
వీళ్ళను కొంచం తేరి పార చూసి " సుజన్ డార్లింగ్... సంబడి ఫర్ యు ఫ్రం ఇండియా" అని లోపలి వెళ్ళింది.
అది విన్న రాధ కుప్ప కూలి పోయింది .... గుమ్మం దగ్గరికి వచ్చిన సుజన్ తల్లి దండ్రుల్ని చూసి కొయ్య బారి పోయాడు...తల్లి పరిస్థితి చూసి అమ్మా అని దగ్గరగా వచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత కనపడిన కొడుకు మొహం లోకి కూడా చూడకుండా రాధను చేతుల్లోకి ఎత్తుకుని లోపలి తీసుకెళ్ళాడు. నెమ్మదిగా తేరుకున్నరాధను చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఏ దేశానికి చెందిన అమ్మాయో! ఎందుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు ఫోను కూడా చేయడం లేదో! ఎందుకలా చేస్తున్నాడో లాంటి ప్రశ్నలు వేయకుండా మౌనంగా వున్న తల్లి దండ్రుల్నిభయం భయంగా చూస్తున్నాడు సుజన్, తర్వాత
.."లూసీ.... మై పేరెంట్స్" అన్నాడు.ఆ అమ్మాయి ప్రక్కనే ఆ అమ్మాయి లాగే వున్నమూడేళ్ళ అబ్బాయి ని చూపిస్తూ, " మార్టిన్ నా కొడుకు" అన్నాడు.
వాడికి మూడేళ్ళు వున్నాయి అంటే ..సుజన్ అమెరికా వెళ్ళిన వెంటనే ఈ అమ్మాయితో పరిచయం, ప్రేమ, పెళ్లి, పిల్లాడు పుట్టడం జరిగి పోయాయన్నమాట అంటే నాలుగేళ్ళుగా మమ్మల్ని అబద్దాలతో మభ్య పెట్టా డన్న మాట....ఏనాడే కానీ అసత్యం చెప్పడానికిదారి తీసే పరిస్థితుల్ని కల్పించుకోని నా సుజన్ ...ఇలా జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో యింత రహస్యంగా, అసత్యాల ఆసరాతో .... ఈసారి ఆనంద్ కు గుండె ఆగినంత పనైయ్యింది. వాడికేది ఇష్టమైతే అదే చేశామే ...ఈ అమ్మాయిని కూడా మేము కాదనే వాళ్ళం కాదే..ఎందుకింత మోసం ?... ఆనంద్ గుండె బాధతో మూల్గింది. రాధ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. లూసిలో ఏ రకమైన చలనం లేదు...ఉదాసీనంగా చూస్తూ .."ఓకే సుజన్ ..అమ్ గోయింగ్ ..మార్టిన్ లవ్ యూ.".సుజన్ కు ఓ ముద్దు, కొడుక్కు ఓ ముద్దు ఇచ్చి కనీసం వీళ్ళ ప్రక్క కూడా చూడ కుండా వెళ్లి పోయింది. ఏ మాత్రం సంస్కారం చూపని ఆ అమ్మాయిని చూస్తూ వుండిపోయారు. ఏమీ అడగ కుండా, ఏమీ మాట్లాడకుండా వున్నఅమ్మా నాన్నలకు ఎదురుగా వుండడం సుజన్ కి చాత కాలేదు.
"ఆఫీసుకు వెళ్ళాలి మార్టిన్ ను స్కూల్ లో వదిలి, సాయంత్రం మాట్లాడుదాం,టేబుల్ పైన లంచ్ వుంది, తిని రెస్ట్ తీసుకోండి. " ఇంకేమి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్లి పోయాడు.
షాక్ నుండి తేరు కోలా ఇద్దరూ, రాధ చిన్నగా ఏడుస్తోంది ...మౌనంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. నా నవ్వుల రాణి కి ఈ వేదన ఎందుకు? అతనికి సుజన్ పుట్టిన రోజూ గుర్తొచ్చింది. బిడ్డను తీసుకుని అత్తగారు చూప బోతే వాడ్ని చూడకుండా లేబర్ రూం లోకి వెళ్లి పోయాడు రాధ కోసం, రాధ కళ్ళు తెరిచి బాబు ఎలా వున్నాడని అడిగితే "ముందు నిన్ను చూడాలని వచ్చాను ... నీకు ఎలా వుంది ? " అన్నాడు, ఆ రోజూ రాధకు కోపం వచ్చింది,కానీ బిడ్డ గురించి కంటే రాధకు ఎంత కష్టం కలిగిందో ప్రసవం లో అనుకున్నాడు ...కానీ ఇన్నేళ్ళ తర్వాత ఆ బిడ్డ కారణంగానే ఆమెకు కష్టం కలుగుతూ వుంటే ఏమీ చేయలేకున్నాడు. సుజన్ గురించి వాడి నాయనమ్మ, అమ్మమ్మ ,తాతయ్యలు, మేనమామ,అత్తలు అందరూ అడుగుతారు, వాళ్ళకేం చెప్పాలి? ఆనంద్ కు ఇదంతా కల అయితే బావుండుననుకున్నాడు.అతని కళ్ళ ముందు పెరిగిన చిన్నారి కొడుకు ఇలా గుండెల్లో గునపాలు గుచ్చు తాడనుకోలా ..!
ఆనంద్ టేబుల్ పైనున్న శాండ్విచ్ రాధకు తెచ్చిచ్చాడు.ఆమె తినలేదు ..అతను తినలేక పోయాడు. ఏదో అనాలని, కొడుకును తిట్టి పోయాలని ...ఇంకా వాడ్ని కసితీరా కొట్టాలని వుంది ఆనంద్ కు ,కానీ బుర్ర మొద్దు బారి పోయింది. సాయంత్రం సుజన్, లూసి, మార్టిన్ వచ్చారు. రాధ లేచి కూర్చుని "ఆనంద్ మనం సుజన్ ని అమ్మాయిని బాబు ని ఇండియా తీసుకెళ్ళి పోదాం" అంది. సాధ్యం కాదని తెలిసినా తల ఊపాడు. ఆ అమ్మాయి లోపలి వెళ్లి బయటికి రాలేదు. సుజన్ ఎదురుగా కూర్చున్నాడు.
"ఎందుకిలా చేసావు"అన్నాడు ఆనంద్.
అతని కంఠం లో కరుకుదనానికి తల్లి కొడుకులు ఇద్దరూ ఉలికి పడ్డారు.
"ఆనంద్..." వారించింది రాధ. అతని చేయి నొక్కింది వద్దన్నట్టు.
"నీ భార్యను, బాబును తీసుకుని ఇండియా వెళదాం,అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు... మళ్ళి కావాలంటే వద్దువు గానీ లే సుజన్." ప్రాధేయపూర్వకంగా అంది రాధ .
"నేను వస్తాలే అమ్మా, ఆమె రాదు."
"నీకు సిగ్గు లేదా..ఈ మాట అనడానికి " కోపంగా అరిచాడు ఆనంద్.
"ఆనంద్... నువ్వువూరుకో ....బాబు ను తీసుకురా నాన్నా! వాడ్ని దగ్గరగా తీసుకుందామని వుంది "అంది.
లోపలికి వెళ్లి చాలా సేపు తర్వాత .. బాబును తీసుకొచ్చాడు వాడ్ని దగ్గరగా తీసుకుని ముద్దు లాడింది రాధ. ఆనంద్ కు రాధ మొహం లోని సంతోషం చూసి మతిపోయింది .ఈమె సుజన్ చేసిన గాయాన్నిఎలా మర్చిపోయిందో అర్థం కాలా ! తల్లి ప్రేమ అంటే ఇదేనేమో ...అనుకున్నాడు.
"ఐ యామ్ యువర్ గ్రాని "అంది రాధ వాడి బుగ్గలు సున్నితంగా తాకుతూ.
పిల్లాడు వెంటనే తడుము కోకుండా "మమ్మీ సేస్ బొత్ అఫ్ యు ఆర్ బెగ్గర్స్ ..."అని విదిలించుకుని పరిగెత్తాడు.
ఆశ్చర్యం, అవమానంతో దుక్ఖం తన్నుకుని వచ్చేలోగానే ..రాధను పొదివి పట్టుకుని అక్కడే వున్న బాగ్ చేతికి తీసుకుని బయటకు వచ్చాడు ఆనంద్. టాక్సీ వచ్చే వరకు బయట వున్నా, సుజన్ వాళ్ళ దగ్గరికిరాలేదు. రాత్రి దిగిన హోటల్ కు రావడం,తిరుగు ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకోవడం.. జరిగి పోయింది. వాళ్ళ ఆనందాన్ని మింగిన అమెరికాను వదిలి ఎయిర్ ఇండియా ఆకాశం లోకి ఎగిసింది. సీట్ బెల్ట్ సర్దుకుంటూ ముందుకు వంగిన ఆనంద్ కు ఎదురుగా పౌచ్ లోమదర్ థేరిసా ముఖచిత్రంతో వున్న మ్యాగజైన్ కనిపించింది. ఆ ప్రేమ స్వరూపిణి ని చూసిన మరునిముషం లోనే ఆనంద్ కు క్రొత్త ఊపిరి వచ్చింది. సుజన్ తల్లి దండ్రులుగా మా ధర్మం మేం నేరవేర్చాం,కొడుకు గా వాడి ధర్మాన్ని, మేం నిర్దేశించ లేం ... ఈ జ్ఞానం మాకు లేకపోతే మాకు మనశ్శాంతి లేదు, వుండదు, రాదు అనుకున్నాడు. సంయమనం కోసం కాసేపు వూపిర్ని,మనసుని నిశ్చలం చేసుకున్నాడు. నెమ్మదిగా రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆనంద్, అతను గుండెలోని బాధను అదిమి పెట్టలేదు, తొలగించాడు. కొడుకు చేసిన గాయాన్ని, క్షమ అనే మందుతో మాన్పు కున్నాడు, వాడు సంతోషంగా వుండాలని కోరుకున్నాడు. ఇంక మర్చిపోయాడు

"రాధా! మనల్ని, మన ప్రేమను కాదని సుజన్ ఇంకో ప్రేమ కోసం వెళ్లి పోయాడు... మనం ఏది కోల్పోయామో దాన్ని తెచ్చుకోలేనప్పుడు ...మనం ఇవ్వగలిగింది, కోల్పోయిన వాళ్లకు ఇవ్వలేమా! మన కళ్ళకు కన్నీళ్ళే లేకపోతే... ప్రపంచాన్నియింత స్పష్టంగా, కరుణ తో, సానుభూతి తో చూడ లేమేమో రాధా!"
అవునన్నట్లుగా తల ఊపి,ఆనంద్ ఎదపై తలవాల్చింది రాధ. ఆమె కను కొనల నుంచి జారిన కన్నీటిని తుడిచి ఇక కన్నీళ్లు వద్దన్నట్లు చూసాడు. రాధ సరే అన్నట్లుగా తల ఊపి,కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
No comments:
Post a Comment