Published in Vishalakshi, in July, 2012,
చిన్నారుల చిరునవ్వుల మద్య
అమాయకమైన, నిష్కల్మషమైనపసివాళ్ళ లోకం నుండి
నేనొక కొత్త ప్రపంచం లోకి త్రోయబడ్డాను
కపటం ,క్రోధం ,కన్నీళ్ళు,కడగళ్ళ బ్రతుకుల్ని
ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకోలేని ఉక్కిరిబిక్కిరి మనుషుల్ని ,
అసత్యాలని ఆహారంగా ,మోసాన్ని పానీయంగా త్రాగే వ్యాపారవేత్తల్ని
డబ్బు కోసం తల్లి, పిల్లలని ,పిల్లలు తల్లితండ్రులని
చంపే కిరాతక మానవ మృగ సంతతిని ,
వావి వరుస ,పాపం పుణ్యం ,మంచి చెడు, నైతికం అనైతికం లేని శృంగార సంబంధాల్ని
క్రొత్తగా చూస్తున్నా! ఇదా నిజమైన ప్రపంచం?
నా ప్రేమ లోకం ఊహా లోకమేనా !
No comments:
Post a Comment